ఇంట్లో సుఖ శాంతులు ఉండాలంటే...

ఇంట్లో పెళ్ళాంతో విసిగిపోయి ప్రశాంతత కోల్పోయిన కుటుంబరావు ఓ సాధువు- సన్నాసి కాదు-దగ్గరకు వెళ్ళాడు!

“స్వామీ,నేను ప్రతీ రోజూ యోగా, ప్రాణాయామం, ధ్యానం చేస్తుంటాను.ఎంత సర్దుకున్నా ఇంట్లో గొడవలు తప్పడం లేదు ప్రశాంతత ఉండటం లేదు” అని తన గోడు వెళ్లబోసుకున్నాడు.

అది విన్న సాధువు"నాయనా అవేమి చేయకుండానే నీ వంట్లో,నీ ఇంట్లో కూడా మానసిక ప్రశాంతత ఉండే తారకమంత్రం ఉపదేశిస్తాను" అన్నాడు.

“అంతకంటేనా స్వామి, కనీసం మీ దయవల్ల శేష జీవితమైనా హాయిగా గడిపేస్తాను” అన్నాడు కుటుంబరావు మహదానందంతో- తాను వచ్చిన పని అంత సులువుగా అయిపోతున్నందుకు!

“ఇకనుండి నీ భార్య నీతో మాట్లాడేటప్పుడు గానీ,నువ్వు మాట్లాడేటప్పుడు గానీ, ఈ నాలుగు పదాలే వాడుతూ ఉండు, నీకు- నీ ప్రశాంతతకు ఢోకా లేదు" అని కింది పదాలు చెప్పాడు “అవేమిటి స్వామీ అంత మహత్తు కలిగినివి” అన్నాడు కుటుంబరావు కుతూహలంగా, ఆత్రుత పట్టలేక... ఇవే నాయనా అవి...

"అలాగే", "సరే", "నీ ఇష్టం", "నువ్వే కరెక్ట్" అది విన్న మన అమాయకపు కుటుంబరావు“ఓస్ ఇంతేనా”అన్నాడు!

“నాయనా ఆ పదాలు అలవాటు పడటం అంత సులభం కాదు (అంత సులభమైతే నాకీ దుస్తులు దాపరించేవి కాదు అని మనసులో అనుకున్నాడు సాధువు)

కానీ ఇవి అలవాటు అయితే మాత్రం ఇంట్లో నీకు ప్రశాంతత లోపం ఉండదు, మళ్ళీ నువ్వు నా దగ్గరకు ఈ విషయమై రావాల్సిన పనే ఉండదు” అన్నాడు సాధువు!

కుటుంబరావుకి చిన్న అనుమానం వచ్చింది!

“స్వామీ విషయం ఇంత చిన్నదైనప్పుడు మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు మీకెవరూ ఈ మంత్రోపదేశం చెయ్యలేదా” అని అడిగాడు మన వెర్రి కుటుంబరావు చాలా అమాయకంగా!

అప్పుడు సాధువు"సంసారంలో ఉన్నప్పుడు-నేనూ భార్య బాధితుణ్ణే- ఆ పదాలు వాటి అర్ధం తెలిసినా అవి వాడలేక పోయాను.వేషం మార్చిన తర్వాత ఎక్కడలేని ప్రశాంతత వచ్చింది.ఇక ఆ పదాలతో నాకు పనిలేదు అందుకే నీకు ఇచ్చేస్స్తున్నా అవన్నీ అన్నాడు.అయినా ఇప్పుడు చాలా సుఖంగా ఉన్నాను, అలా అని నాలా అవ్వమని బోధ చెయ్యట్లేదు నాయనా, కిటుకు మాత్రమే చెప్తున్నా అన్నాడు సాధువు మన కుటుంబరావు వీటిని సాధనచేసి తారకమంత్రంగా వల్లెవేస్తున్నాడని,తన శేషజీవితమంతా సుఖంగా జీవిస్తున్నాడని ఆశిద్దాం!

మీలోకూడా ఓ కుటుంబరావు ఉంటే మీరుకూడా ప్రయత్నం చేయండి- నా వరకు నేనూ సాధన చెయ్యడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా!

భగవంతుడి పిలుపు వచ్చేలోపే ఈ మాటలు త్వరగా అలవాడాలని ఓ పిచ్చ కోరిక!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!